ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాసన మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ శాసనసభలో స్పష్టం చేశారు. శాసనమండలి చేసిన సవరణలు... ఆమోదించాల్సిన అవసరం శాసనసభకు లేదని పేర్కొన్నారు. శాసనసభ, మండలి ప్రజలకు మంచి చేసేదిలా ఉండాలని...అలా లేనప్పుడు రద్దు చేయడమే మేలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి మండలికి రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి అర్హత లేదన్నారు. మండలికి ఏడాదికి దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దండగన్నారు. శాసనమండలి రద్దుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారనే... ముందుగా విపక్షాలకు మూడు రోజుల సమయం ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నారన్నారు. తమ పార్టీ నాయకులను కొనుగోలు చేసి...వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.
ఇదీచదవండి