అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టాలా..? వద్దా..? అనే అంశంపై ఈనెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. కోర్టు విధించిన బెయిల్ షరతులు జగన్ ఉల్లంఘించారని.. రద్దు చేయాలని ఆయన పిటిషన్లో కోరారు. ముఖ్యమంత్రిగా ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ పిటిషన్ వేసే అర్హత ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఛార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ మాత్రమే బెయిల్ రద్దు చేయాలని కోరాలని ఏమీ లేదని.. ఎవరైనా పిటిషన్ దాఖలు చేయవచ్చునని వాదించారు. పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పేర్కొందని వివరణ ఇచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణ అర్హతపై నిర్ణయాన్ని ఈనెల 27కి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... దేవినేనిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు