తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకుంటాయంటూ ఎక్సైజ్ శాఖ పేరుతో నకిలీ జీవోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన ఐదుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నాంపల్లి అఘాపురాకి చెందిన అనూశ్ కుమార్, బషీర్బాగ్కి చెందిన హనుమాన్ రాజులతో పాటు మరో ముగ్గురికి నోటీసులు అందజేశారు. వీరితో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేసిన మరికొంత మందిని పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు