కృష్ణా జిల్లాలో..
నందిగామలో మధ్యాహ్నం 12 గంటల నుంచి పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం కల్లా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చే వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
తణుకులో నాలుగో రోజు కర్ఫ్యూ అమలు జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాల తెరుస్తుండడంతో నిత్యావసరాల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పోలీసులు కొవిడ్ నింబధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
విజయనగరం జిల్లాలో ..
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం , ఎల్విన్ పేట పోలీసులు ప్రజలకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు.
ప్రకాశం జిల్లాలో..
కనిగిరి నగర పంచాయతీలో రోజురోజుకూ కరోనా బాధితులు పెరుగుతున్నందున అధికారులు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కనిగిరి అంతా నిర్మానుష్యంగా మారింది. కనిగిరి నగర పంచాయతీ కమిషనర్ కరోనా బాధితులు ఉన్న ప్రాంతమంతా శానిటైజేషన్ చేయించి బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడి విఫలయత్నం.. కానీ