ETV Bharat / city

నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న తరుణంలో నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని యంత్రాంగాన్ని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి వచ్చేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పల్లెల్లో మాత్రం ఒంటిగంట వరకూ వెసులుబాటు ఉందన్నారు. సరుకుల వాహనాలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం లేకుండా చూడాలని డీజీపీ గౌతం సవాంగ్‌ స్పష్టం చేశారు.

cs neelam sahni
నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
author img

By

Published : Mar 30, 2020, 6:25 AM IST

నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ధరల పెరుగుదలను నివారించేందుకు నిత్యావసర సరుకుల దుకాణాల బయట ధరల పట్టిక ప్రదర్శించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర సహా పలువురు కార్యదర్శులు, వివిధ విభాగాల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రైతు బజార్ల వద్ద రద్దీ నివారించేందుకు పట్టణ ప్రాంతాల్లో ప్రతి వార్డుకు ఒక రైతు బజారు ఉండేలా చూడాలని ఆదేశించారు. వీలైనంత వరకు ఇంటింటికీ కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరుకులకు సంబంధించి సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో 1902 నంబరుతో 24గంటలూ పనిచేస్తున్న కంట్రోల్ రూమ్ తరహాలో..జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులు, విద్యార్థులు, కూలీలకు తగిన ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. పారిశుద్ధ్యం, శానిటైజేషన్ ప్రక్రియను మెరుగు పరచాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు.

నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలకు ఎక్కడా ఆటంకం లేకుండా, సకాలంలో నిర్దేశిత ప్రాంతాలకు చేరుకునేలా చూడాలని ఎస్పీలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఈ సమాచారం క్షేత్ర స్థాయిలోని ప్రతి పోలీస్ స్టేషన్, కానిస్టేబుల్ స్థాయి వరకూ వెళ్లాలని నిర్దేశించారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, చేపలు, రొయ్యల చెరువులలో పని చేసే కూలీలను అనుమతించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ఉదయం 11గంటల తర్వాత ఎవ్వరూ రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల దిల్లీలో మత ప్రార్థనలకు రాష్ట్రం నుంచి వెళ్లి వచ్చిన 472 మంది వివరాలు జిల్లాలకు పంపుతున్నామన్న డీజీపీ.. వారిని తక్షణం గుర్తించి హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచాలని సూచించారు. కరోనాకు సంబంధించి దేశంలో గుర్తించిన 20 హాట్ స్పాట్ ప్రాంతాల్లో రాష్ట్రం లేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి చెప్పారు.

ఇవీ చూడండి-లాక్​డౌన్​లో ఏం చేయాలంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.