ETV Bharat / city

1.33 లక్షల హెక్టార్లలో పంట నష్టం - ఏపీలో పంటలు నష్టం వార్తలు

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పాటు కృష్ణా, గోదావరి వరదల కారణంగా లక్షలాది ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 లక్షల 70 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సాధారణం కన్నా అధికంగా 691 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు పేర్కొంది.

అధిక వర్షపాతం...అపార నష్టం
అధిక వర్షపాతం...అపార నష్టం
author img

By

Published : Oct 3, 2020, 6:00 AM IST

Updated : Oct 3, 2020, 6:29 AM IST

కృష్ణా, గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా మొత్తం 3,70,055 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్దారణకు వచ్చింది. 1,73,928 ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగిందని అంచనా వేశారు. 77,500 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి 48 వేల 888 ఎకరాల మేర నష్టం వాటిల్లింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,29, 442 ఎకరాల్లో పంట నష్ట పోయినట్టు అంచనాలు రూపొందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సాధారణం కంటే ఎక్కువగా 691 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిందని ప్రభుత్వం పేర్కొంది. ఒక్క శ్రీకాకుళం జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా 26 శాతం మేర అధిక వర్షం కురిసింది.

ఈసారి ఖరీఫ్ సీజన్ కు 34.49 లక్షల హెక్టార్లలో పంటలు వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 6 జిల్లాల్లో ప్రధానంగా పంట నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి : 'దశల వారీగా సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నాం'

Last Updated : Oct 3, 2020, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.