ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు - ఏపీ కోవిడ్ న్యూస్

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు
author img

By

Published : Apr 28, 2020, 11:25 AM IST

Updated : Apr 29, 2020, 7:01 AM IST

09:02 April 28

కోవిడ్ కేసులు

హెల్త్ బులెటిన్
హెల్త్ బులెటిన్

కంటైన్మెంట్‌ జోన్లలో కేసుల కలకలం కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 82 మందిలో వైరస్‌ గుర్తించినట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కేసుల్లో కర్నూలు జిల్లాలోనే 40 ఉండగా...గుంటూరు, కృష్ణాలో కలిపి మరో 30 ఉన్నాయి.

కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఈ 3 జిల్లాల్లోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం ప్రకటించింది. వాటిలో పై 3 జిల్లాల్లోనే 70 ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 1259కి పెరిగింది. వీటిలోనూ 64 శాతానికి పైగా ఆ 3 జిల్లాలవే. తాజాగా 5వేల 783 శాంపిళ్లు పరీక్షించారు. కొత్తగా మరణాలు ఏమీ సంభవించలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ రాష్ట్రంలో కరోనా వల్ల 31 మంది మరణించారు. 6 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 23 మంది కోలుకోగా వారిని ఇళ్లకు పంపారు.

పల్నాడులో కేసులు

ఇన్నాళ్లూ గుంటూరు అర్బన్ పరిధిలో కేసుల తాకిడి ఉండగా ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 17 కేసులు నమోదు కాగా నరసరావుపేటలో 12 బయటపడ్డాయి. నరసరావుపేట పట్టణంలో వైరస్ పీడితుల సంఖ్య 70 దాటిపోయింది. 2 కేసులు కొప్పునూరు, ఒకటి గుంటూరులో నమోదైంది. మరో కేసు విషయం తేలాల్సి ఉంది. తాజా కేసులతో గుంటూరు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 254కి పెరిగింది.  

నేడు, రేపు పూర్తి లాక్​డౌన్

పల్నాడులో వైరస్ వ్యాప్తిని నిరోధించాలని యంత్రాంగం కంకణం కట్టుకొంది. ఇవాళ, రేపు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయనున్నారు. రామిరెడ్డిపేట, వరవకట్ట ప్రాంతాల్లో ఇప్పటికే ఆ దిశలో అవగాహన కల్పించారు. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని, వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్‌లైన దాచేపల్లి, కొండ్రుముట్లలో పర్యటించి... వైరస్ వ్యాప్తికి కారణాలు, బాధితులు సంచరించిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల గురించి ఆరా తీశారు. జిల్లాలో రెండో కొవిడ్ ఆస్పత్రిని జీజీహెచ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ పరిశీలించారు. జిల్లాలో ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులకు పరీక్షలు పూర్తయ్యాయని, సెకండరీ కాంటాక్ట్‌లకు ప్రక్రియ జరుగుతోందని జేసీ దినేశ్ కుమార్ చెప్పారు.

శ్రీకాళహస్తి, తిరుపతి పూర్తిగా రెడ్​జోన్

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 82 కేసుల్లో 40 మంది బాధితులు కర్నూలు జిల్లాలోనే ఉండటం అక్కడ వైరస్‌ ఉద్ధృతికి నిదర్శనం. ఫలితంగా జిల్లాలో కేసుల సంఖ్య 332కి చేరింది. ఇప్పటి వరకు 9 మంది మరణించగా.. 43 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 280 మంది కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న శ్రీకాళహస్తి, తిరుపతిని అధికారులు పూర్తిగా రెడ్ జోన్ గా ప్రకటించి, 6 గంటలకొకసారి పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మరో పాజిటివ్ కేసు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 74కి చేరింది. ఇందులో శ్రీకాళహస్తిలోనే 44 కేసులు గుర్తించారు. తాజా కేసు సైతం శ్రీకాళహస్తిలో గతంలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కాంటాక్ట్‌గా అధికారులు గుర్తించారు.

యువకుడి అనారోగ్యంతో అధికారులు పరుగులు

కడప జిల్లా జమ్మలమడుగులో అనారోగ్యంగా ఉన్న ఓ యువకుడిని గుర్తించిన యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. వారం రోజుల కిందట ఒంగోలు నుంచి చేరుకున్న అతడు   తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది, పోలీసులకు సమాచారం అందింది. స్థానిక ముద్దునూరు రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్లో ఆ యువకుడు నివాసముంటున్నాడు. మంగళవారం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడినుంచి ట్రూ నాట్ పరీక్షల నిమిత్తం ప్రొద్దుటూరు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు పట్టణమంతా బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీ చేయించారు.  

ఇదీ చదవండి :  వైకాపా నేతల వల్లే కరోనా కేసులు పెరిగాయ్ : చంద్రబాబు

Last Updated : Apr 29, 2020, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.