ETV Bharat / city

CPM protest: 'రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి'

CPM protest: రైతు పండించిన పంటలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు దానిని అమలు చేయలేదని పాలకొండలోని సీపీఎం మండల కమిటీ కన్వీనర్ ​దావాల రమణారావు అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

CPM protest in srikakulam
రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలి
author img

By

Published : Mar 4, 2022, 2:17 PM IST

CPM protest in srikakulam: రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని పాలకొండలోని సీపీఎం మండల కమిటీ కన్వీనర్ ​దావాల రమణారావు డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించవలసి ఉన్నప్పటికీ, నేటికీ సగం ధాన్యం సైతం కొనుగోలు చేయలేదని అన్నారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.615.87 కోట్లు నెల రోజులు దాటినా చెల్లించడం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వలన ప్రైవేటు వ్యాపారులు బస్తాకు రూ.200 వరకు ధరను తగ్గిస్తున్నారని తెలిపారు. 5 నుంచి 10 కేజీలు అదనంగా ధాన్యాన్ని తూకం వేసి రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రాప్ బుకింగ్ లేదని కౌలు రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్నారని అన్నారు. అడంగల్ రావడం లేదని రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుకు నిరాకరిస్తున్నారని తెలిపారు.

రైతు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం వ్యాపారుల దోపిడీకి స్వేచ్ఛ కల్పించిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని ఆగ్రహించారు. ఆరుగాలం కష్టపడి, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేసి పండించిన పంటలు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని తడిసిన, రంగుమారిన ధాన్యంతో సహా.. రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి రావలసిన సొమ్ము మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే జమ చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Road Accident: వేర్వేరు చోట్ల ప్రమాదాలు...గాయపడ్డ 14మంది ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.