భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తున్న కారణంగా సీపీఎం నేత సిహెచ్ బాబూరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వీరితో పాటు పలువురు కార్మిక నేతలకు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా 42 వేల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఉన్నా నయా పైసా విడుదల చేయలేదని బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవని బాబురావు అన్నారు. దీంతో కార్శికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద 1500 కోట్ల రూపాయలకు పైగా సంక్షేమ నిధి ఉన్నా కార్మికులకు విడుదల చేయకుండా దారి మళ్లీస్తోందని ఆరోపించారు. గత్యంతరం లేక కార్మిక సంఘాలు ఐక్యంగా చలో సీఎం క్యాంప్ ఆఫీస్కు పిలుపునిచ్చాయని వెల్లడించారు. సమస్యను పరిష్కరించకుండా కార్మిక నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేయటం అన్యాయం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...సంచైత మరో నిర్ణయం.. ఎమ్మార్ స్టేడియానికి లాక్!