టిడ్కో గృహాలు నిరుపేదలకు పంపిణీ చేయకపోతే.. లబ్ధిదారుల చేత గృహప్రవేశం చేయిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన టిడ్కో గృహాలను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాలు పూర్తైనా.. వాటిని లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడంలేదని ప్రశ్నించారు.
నిరుపేదలకు అందిస్తామన్న ఇంటి స్థలాల పంపిణీ సైతం వాయిదా వేస్తున్నారని ఆగ్రహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాన్ని నిరుపేదలకు తక్షణం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: