ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు, ప్రజల ఇబ్బందులపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఊహించిన దానికన్నా ఎక్కువగా వ్యాధి ప్రబలుతోందని పేర్కొన్నారు. లాక్ డౌన్ తో పేదల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించటం లేదని తెలిపారు. తెలంగాణలో మాదిరిగా మన రాష్ట్రంలో తగిన చర్యలను చేపట్టాలని కోరారు. ప్రధాని మోదీ ఈనెల 8న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని లేఖలో ప్రస్తావించారు.
'రాష్ట్రంలోని పరిస్థితులపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయండి' - latest updates of corona virus
కరోనా విపత్తు, ప్రజల ఇబ్బందులపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు.
!['రాష్ట్రంలోని పరిస్థితులపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయండి' CPI Ramakrishna Letter to CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6694072-708-6694072-1586238078288.jpg?imwidth=3840)