మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ నిబంధనలు వర్తించవా అని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. కరోనా దృష్ట్యా ప్రజలంతా మందుల కోసం చూస్తున్నారని...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మద్యం సరఫరా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు మద్యం షాపులపై ఉన్న ప్రేమ పుస్తక దుకాణాలపై లేదని ఆరోపించారు.
నిత్యావసరాల కోసం ఉదయం 6 నుంచి 9 వరకే అనుమతిస్తున్నారని... మద్యానికి మాత్రం ఉ.11 నుంచి రా.7 వరకు అనుమతులివ్వడం సరికాదని రామకృష్ణ అన్నారు. ప్రజల ప్రాణాల కన్నా ఆదాయంపైనే దృష్టి సారించడం విచారకరమన్నారు. పేదలను ఆదుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నేడు సీపీఐ మౌన దీక్షలు చేపట్టిందని తెలిపారు.
ఇదీ చదవండి...'నమస్తే'తో కరోనా మహమ్మారి దూరం