పంచాయతీ ఎన్నికలపై సీపీఐ కేంద్ర కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ పట్టుదలకు పోవడంతో రాష్ట్రంలో విద్వేష పూరిత వాతావరణం నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల జోక్యంతో ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణం నెలకొందని నారాయణ అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలు జరపాలని నారాయణ అన్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ