బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువతకు, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పూర్తి విరుద్ధంగా.. కేవలం సంపాదన కోసం ఈ షో నిర్వహించటం అనైతికమన్నారు. సంస్కృతిని అమ్మేసుకుంటూ.. డబ్బు సంపాదన అవసరమా అని బిగ్ బాస్ షో ప్రదర్శన నిర్వాహకులను నారాయణ ప్రశ్నించారు. ఆ షోలో ఉండే యువతి, యువకులు 24 గంటలు ఏమి చేస్తున్నారో తెలీదని.. లోపల అసాంఘిక కార్యకలాపాలు జరుతున్నాయని తనకు అనుమానంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: