ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించాలని సీపీఐ పార్టీ సూచించింది. వరదలపై సీపీఐ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల ఏపీలో తీవ్ర నష్టం జరిగిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. 2.02 లక్షల ఎకరాల్లో చేతికి వచ్చిన పంట దెబ్బతిందన్నారు.
రాయలసీమ ప్రాంతంలో 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట నష్టం జరిగిందిని సీపీఐ నేతలు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయినవారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ నేతలు కోరారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందించాలన్నారు. నిత్యావసర వస్తువులతో పాటు రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రైతులను ఆదుకోవడంలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించట్లేదు: పవన్