వలసకూలీల కోసం స్పందన్ వెబ్‌సైట్‌లో ఆన్లైన్ యాప్ సిద్ధం చేసినట్లు కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారి కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రానికి వచ్చేవాళ్లు స్పందన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. spandana.ap.gov.inలో వివరాలు తెలపాలని పేర్కొన్నారు. తరలింపులో సరైన పద్ధతి పాటించకుంటే అనేక ఇబ్బందులు వస్తాయన్న ఆయన... కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
- వలసకూలీలు తాము ఉంటున్న ప్రాంతం, వెళ్లే ప్రాంతం తెలపాలి.
- ఇతరచోట్లకు వెళ్లేవారు, ఇక్కడకు వచ్చేవారిపట్ల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
- రాజస్థాన్ మౌంట్ అబూలో 600 మంది ఏపీ వాసులు ఉన్నారు.
- మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 7425 మంది కూలీలు రాష్ట్రంలో ఉన్నారు.
- 500 కిలోమీటర్లు దూరం దాటితే రైళ్లలో తరలించాలని కేంద్రం చెప్పింది.
- అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, కంట్రోల్ రూమ్‌లతో మాట్లాడుతున్నాం.
- భువనేశ్వర్, దిల్లీ, గోరఖ్‌పూర్, పట్నా, భోపాల్‌కు రైళ్లు పంపిస్తాం.
- రేపు విజయవాడ నుంచి బల్హార్షాకు 2 రైళ్లు బయలుదేరతాయి.
- పాసులు, అనుమతి ఉన్న వలసకూలీలనే రైళ్లలో తరలిస్తాం
- వలసకూలీలను తరలించే శ్రామిక్ రైళ్లు మధ్యలో ఎక్కడా ఆగవు.
ఇదీ చూడండి..