ETV Bharat / city

couple suicide at telangana: ఆర్థిక ఇబ్బందులు అంతమొందించాయి..! - కరీంనగర్‌ తాజా నేర వార్తలు

couple suicide at telangana: వారిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి... అయినా సంతోషంగా బతికారు... పిల్లలిద్దరికీ ఉన్నంతలో వివాహం జరిపించారు... బాధ్యతలు తీరాక కిరాణా దుకాణం నడపుకుంటూ జీవనం సాగిస్తున్నారు... కానీ అది సరిగా సాగలేదు... ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి... సమస్యలు సతమతమయ్యేలా చేశాయి. ఎవరికీ చెప్పుకోలేక మనోవేదన అనుభవించారు.... వీటన్నింటికీ చావే పరిష్కారమని నిర్ణయించుకున్నారు... అందుకే ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదం ఎక్కడ జరిగిందంటే...?

couple suicide at telangana
ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులు
author img

By

Published : Mar 5, 2022, 8:01 PM IST

couple suicide at telangana: తెలంగాణలోని కరీంనగర్​ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులకు తాళలేక దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అశోక్ నగర్ కు చెందిన నార్ల వెంకటేష్ సుజాత దంపతులు తాము నివాసముంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.

వీరికి ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరికి వివాహం అయింది. ఈ సమయంలో కిరాణా దుకాణం సరిగా నడవక పోవడంతో మానసిక వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బాల్కనీలో ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కుమారుడు స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Mother Jumped into Well with kids : ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.