తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం పాత పాల్వంచ తూర్పు బజారులో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకైన ఘటనలో.. కుమార్తె సహా దంపతులు సజీవదహనమయ్యారు. మంటలు అంటుకొని మరో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సదరు చిన్నారిని పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నాగరామకృష్ణ , శ్రీలక్ష్మి దంపతులు. వీరికి కుమార్తెలు సాహిత్య, సాహితి ఉన్నారు. పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నడిపిన నాగరామకృష్ణ.. ఇటీవలే దానిని ఇతరులకు విక్రయించేశాడు. అనంతరం కుటుంబంతో కలిసి రాజమహేంద్రవరం వెళ్లాడు. రెండ్రోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి పాల్వంచకు వచ్చాడు.
ఈ క్రమంలోనే.. ఈ దుర్ఘటన జరగడం పట్ల పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా ఆత్మహత్యనా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: Gas Cylinder leakage in Bachupally: గ్యాస్ సిలిండర్ లీక్... నలుగురికి గాయాలు