ETV Bharat / city

భారీవర్షాలు, గులాబీ పురుగు తాకిడితో పడిపోయిన పత్తి దిగుబడి

భారీవర్షాలు, గులాబీ పురుగు తాకిడితో పత్తి పంట దిగుబడి పడిపోయింది. మద్దతు ధర దక్కడం లేదు. రూ.3,750 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కౌలు రైతుల పరిస్థితి దైన్యంగా మారింది.

author img

By

Published : Nov 11, 2020, 8:13 AM IST

cotton crop loss
cotton crop loss

ఒకవైపు భారీ వర్షాల తాకిడి.. మరోవైపు గులాబీ రంగు పురుగు ఉద్ధృతి.. ఇంకోవైపు మద్దతు ధర దక్కని దైన్యం.. పత్తి రైతులను ముంచేశాయి. ఆగస్టు నుంచి ఎడతెరిపి లేని వానలతో ఒక కాపు పూర్తిగా దెబ్బతింది. తొలుత పడిన కాయలూ కుళ్లిపోయాయి. పత్తి తడిచింది. ఎకరాకు 4 క్వింటాళ్లకు పైగా దిగుబడి కోల్పోయారు. అక్కడక్కడా కొద్దిపాటి కాయలున్నా.. వాటిలోకి గులాబీరంగు పురుగు చేరి తొలిచేస్తోంది. రెండో కాపు సమయంలో వానలు కురవడంతో గూడ, పూత, పిందెలు రాలిపోయాయి. మొక్కలు ఎర్రబారాయి. ఉన్న కొద్దిపాటి పత్తి తీయించాలంటే క్వింటాలుకు రూ.1,800 నుంచి రూ.2వేల వరకు ఖర్చవుతోంది. ఇంతా చేస్తే.. తడిచిన పత్తి అంటూ వ్యాపారులు రూ.2,500 నుంచి రూ.3వేల లోపే ఇస్తున్నారని కొందరు రైతులు తీయించకుండానే వదిలేస్తున్నారు. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడం, రోజుల తరబడి నీరు నిలవడంతో పత్తి చేలు ఎండిపోయాయి. మరో పంట అయినా వేసుకోవచ్చని వాటిని తొలగిస్తున్నారు.

పెరిగిన పెట్టుబడి.. దక్కని దిగుబడి

* ఎడతెరిపిలేని వానలతో పురుగుతాకిడి పెరిగింది. పొలాల్లో తేమ ఎక్కువై.. ఎరువులు అధికంగా వేశారు.
* ఈ ఏడాది సాధారణం కంటే ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు పెట్టుబడి పెరిగింది.
* అక్టోబరులో వచ్చే గులాబీ పురుగు ఈ ఏడాది సెప్టెంబరులోనే ఆశించింది.
* తొలికాపులో అధికభాగం కుళ్లిపోయింది. రెండో కాపు రాలిపోయింది.
* ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున రావాల్సిన పొలాల్లో.. ఇప్పుడు రెండు క్వింటాళ్ల లోపే ఉంది.
* నవంబరు కూడా రావడంతో పైరు కాపు వచ్చే అవకాశాలూ తక్కువే. ఒకవేళ వచ్చినా.. గులాబీ పురుగు ఉద్ధృతితో అదీ గుడ్డిపత్తిగానే మారుతుంది.
కౌలు రైతుకు రూ.40వేల నష్టం
సగటున ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి చొప్పున మొత్తంగా రూ.3,750 కోట్లు రైతులు కోల్పోయారు. కౌలు రైతులకైతే ఎకరానికి రూ.20 వేల చొప్పున అదనపు నష్టం. పత్తిలో తేమ సాకుతో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తోంది. ఇదే అదనుగా వ్యాపారులు ధర మరింత తగ్గిస్తున్నారు.

cotton crop loss
భారీవర్షాలు, గులాబీ పురుగు తాకిడితో పడిపోయిన దిగుబడి

తొలికాపు మొత్తం పోయింది

ఎకరా రూ.20 వేల చొప్పున రెండెకరాలు కౌలుకు తీసుకున్నా. దీంతోపాటు మూడెకరాల సొంత పొలంలోనూ పత్తి వేశాను. వానలకు ఎకరానికి నాలుగు క్వింటాళ్ల వరకు కిందకాపు మొత్తం దెబ్బతింది. ఇప్పుడు ఎకరాకు రెండు క్వింటాళ్లే ఉంది. వరద పారడంతో పత్తి చేలు ఎండిపోయాయి. దీంతో మొక్కలు పీకేస్తున్నారు. ఎకరాకు రూ.15 వేలకు పైగా పెట్టుబడి పోయినట్లే. - పోతురాజు, పాములపాడు, అమరావతి మండలం

చెట్టుకు 15 నుంచి 20 కాయలే

ఆరెకరాల్లో పత్తి వేశాం. వర్షానికి కాయలు కుళ్లిపోతున్నాయి. గులాబీ పురుగు బాగా పెరిగింది. చెట్టుకు 15 నుంచి 20 కాయలు కూడా మిగల్లేదు. ధర క్వింటాలుకు రూ.4 వేలు కూడా ఇవ్వడం లేదు. - వీరేశ్‌, హుళగుంద, కర్నూలు జిల్లా

ఇదీ చదవండి: విశాఖలో ఆక్రమణలన్నింటి వెనుకా నేతలే : ఎంపీ విజయసాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.