రాష్ట్రంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతోన్న దృష్ట్యా ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లను పెంచేందుకు, అందుకు తగ్గట్లుగా వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1170 స్పెషలిస్టులు, 1170 జనలర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 306 మంది అనస్తిషియా టెక్నీషియన్లు, 300 మంది ఎఫ్ఎన్ఓలు, 300 మంది ఎమ్ఎన్వోలు, 300 మంది స్వీపర్లను 6 నెలల పాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని... రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండీ... దేవాదాయశాఖ నుంచి ట్రస్ట్‌కు చేరిన ప్రేమ సమాజం ఆశ్రమం