కరోనా నిర్ధరణ పరీక్షలకు సంబంధించిన ధరల్ని తగ్గిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన నమూనాల పరీక్షకు 2400 రూపాయలుగా ఉన్న ధరను 1600 రూపాయలకు తగ్గించారు. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ .జవహర్ రెడ్డి ఈ ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో పరీక్షచేయించుకునే వారి కోసం నిర్దేశించిన 2900 రూపాయల ధరను 1900 రూపాయలకు తగ్గించారు.
బహిరంగ మార్కెట్లో ఆర్టీపీసీఆర్ కిట్ల ధరలు తగ్గిన కారణంగానే నిర్ధరణ పరీక్షల ధరల్ని తగ్గించినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. మరోవైపు ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే అనుమతి పొందిన ల్యాబ్ లు నిర్ధరణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు ల్యాబ్‌లు వసూలు చేస్తున్న ధరలపై దృష్టి సారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!