ETV Bharat / city

తెలంగాణ :పెద్దపల్లి ఆసుపత్రిలో కరోనా రోగి హల్​చల్

తెలంగాణలోని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగి హల్​చల్​ చేశాడు. తాను ఇంటికి పోతానంటూ ఆసుపత్రి ఆవరణలోకి వచ్చి... వైద్య సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు.

telengana
పెద్దపల్లి ఆసుపత్రిలో కరోనా రోగి హల్​చల్
author img

By

Published : Jul 10, 2020, 4:39 PM IST

పెద్దపల్లి ఆసుపత్రిలో కరోనా రోగి హల్​చల్

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరోనా బాధితుడు హల్​చల్​ సృష్టించాడు. రామగుండానికి చెందిన వ్యక్తికి గురువారం కరోనా పాజిటివ్​ రావడం వల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్​ వార్డుకు తరలించారు.

గురువారం రాత్రి .. తాను ఇంటికి వెళ్లిపోతానని దుస్తుల సంచితో అతను బయల్దేరడంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందారు. ఐసోలేషన్​ వార్డు నుంచి ప్రభుత్వాసుపత్రి ఆవరణలోకి వచ్చి.. గంటసేపు ఇబ్బంది పెట్టాడు. చివరకు శుక్రవారం ఇంటికి పంపిస్తామని పెద్దపల్లి ఎస్సై రాజేష్​తో పాటు వైద్యసిబ్బంది వారించడం వల్ల ఐసోలేషన్​ వార్డులోపలికి వెళ్లిపోయాడు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి: ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.