రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,410 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 368 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. కృష్ణా జిల్లాల్లో ఒక్కరు మరణించారు.
కృష్ణాలో అత్యధికంగా 45.. విజయనగరంలో అత్యల్పంగా నలుగురికి కొవిడ్ నిర్ధారణ జరిగింది. చిత్తూరులో 39, గుంటూరులో 35, తూర్పు గోదావరిలో 32, కడపలో 10, విశాఖపట్నంలో 22, అనంతపురంలో 30, శ్రీకాకుళంలో 9, నెల్లూరులో 24, ప్రకాశంలో 12, పశ్చిమగోదావరిలో 21, కర్నూలులో 12 మంది వైరస్ బారిన పడ్డారు.
మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు కోటీ 21 లక్షల మందికి పైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. 8,84,171 మందికి కరోనా సోకినట్లు వెల్లడించింది. 8,74,223 మందికి పైగా మహమ్మారి నుంచి కోలుకోగా.. 7,126 మంది మృతి చెందారని వివరించింది. 2,822 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.
ఇదీ చదవండి: