రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా మరో 23 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కేసుల సంఖ్య 525కు పెరిగింది. కర్నూలులో 13, గంటూరులో 4, , కడపలో 3, నెల్లూరులో 2, అనంతపురం జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు అయినట్టు స్పష్టం చేసింది. మరోవైపు కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో మరో ముగ్గురు మరణించినట్టు ప్రభుత్వం ధ్రువీకరించింది. దీంతో ఇప్పటి వరకూ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 14కు పెరిగింది.
కర్నూలులో 13 , గుంటూరులో 4, కడప 3, నెల్లూరుల 2, అనంతపురం లో ఒక్క కేసు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలియజేసింది. అలాగే విశాఖలో చికిత్స పొందుతూ కోలుకుని ఆస్పత్రి నుంచి 4గురు డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 491గా నమోదు అయ్యింది. కొత్తగా నాలుగు కేసులు పెరగటంతో గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 122కు పెరిగింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 4గురు మృతి చెందటంతో ప్రస్తుతం ఆస్పత్రుల్లో 118 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా 13 పాజిటివ్ కేసులు పెరగటంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 110 కి పెరిగింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 2 మృతి చెందటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ 19 రోగుల సంఖ్య 108గా ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
కరోనా వైరస్ కారణంగా మరో ముగ్గురు మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో వివరించింది. నెల్లూరుకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి , కర్నూలులో 76 ఏళ్ల వ్యక్తితో పాటు గుంటూరులో మరో 74 ఏళ్ల మహిళ మృతి చెందినట్టు తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 20కి పెరిగింది.