దేశవ్యాప్తంగా కరోనా హాట్స్పాట్ల జాబితాను కేంద్రం విడుదల చేసింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎస్‌లను కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాలకు ప్రత్యేక లేఖలు రాశారు. హాట్స్పాట్ల జాబితాలను కేంద్రం ఆయా రాష్ట్రాలకు పంపింది. 28 రోజుల పాటు ఆ హాట్స్పాట్లలో ఒక్క కేసు నమోదు కాని పక్షంలో గ్రీన్‌జోన్‌లోకి మారుస్తామని కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 19 జిల్లాలను హాట్స్పాట్లుగా కేంద్రం గుర్తించింది. ఏపీలో 11, తెలంగాణలో 8 హాట్‌స్పాట్ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, శ్రీకాకుళం మినహా 11 జిల్లాలను కేంద్రం హాట్స్పాట్ల జాబితాలో చేర్చింది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి అర్బన్, గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలను హాట్స్పాట్లుగా గుర్తించింది.
ఇదీ చదవండి: