పరిశ్రమల మూసివేతకు కారణాలెన్నో:
కూలీలు పనికి రాకపోవడం, ఏదైనా ఇబ్బంది ఎదురైతే తమను బాధ్యులుగా చేస్తారేమోనన్న భయం యాజమాన్యాల్లో ఉండటం... కొందరు డ్రైవర్లు వాహనాలు తీయకపోవడం, ప్యాకింగ్‌కు అవసరమయ్యే ముడి సామగ్రి లభించకపోవడం టమాటా గుజ్జు పరిశ్రమలు పని చేయడం లేదు.
సహాయ కేంద్రాలు సత్వరం స్పందిస్తేనే:
వాహనాలను ఎక్కడైనా పోలీసులు ఆపినప్పుడు జిల్లా, రాష్ట్ర స్థాయిలోని సహాయ కేంద్రాలకు ఫోన్ చేసినా.. సరైన స్పందన కానరావడం లేదని కొన్ని యూనిట్ల యజమానులు వివరించారు. వాహనం నిలిపేశారని సమాచారం ఇచ్చిన వెంటనే వారు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా రక్కసి అంతానికి ఆయుర్వేద బ్రహ్మాస్త్రం!