ETV Bharat / city

ఆహార ఉత్పత్తులపై కరోనా దెబ్బ

author img

By

Published : Apr 29, 2020, 4:01 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ప్రధానమైంది ఆహార ఉత్పత్తి రంగం. ఏటా విదేశాలకు 20వేల కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులు జరిపే ఈ రంగం... కరోనా దెబ్బకి ఒక్కసారిగా కుదేలైంది. ముఖ్యంగా సీజన్ ప్రకారం నడిచే వ్యాపారంలో ఉత్పత్తి ఆగిపోవటంతో వీటిపై ఆధారపడి బతికేవారి మీదా ఆ ప్రభావం పడింది.  80శాతం ఉత్పత్తి రాష్ట్రంలో ఆగిపోవటంతో  పరిశ్రమలు తిరిగి పునరుద్ధరణ కష్టతరంగా మారనుంది.

Corona Effect On Food Processing
Corona Effect On Food Processing

వ్యవసాయం, ఉద్యాన పంటల్లో ఆంధ్రప్రదేశ్​కు దేశంలో సాటి లేదు. వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ వంటి వ్యవసాయోత్పత్తులతో పాటు.. అరటి, మామిడి, కొబ్బరి, బొప్పాయి, జామ, నిమ్మ, జీడి, దానిమ్మ, టమోట, ఉల్లి, క్యారెట్, నూనె గింజల ఉత్పత్తిలో దేశంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. ఐదున్నర కోట్ల జనాభాలో వ్యవసాయ రంగం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాదాపు 70 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే... దీనికి అనుబంధంగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై మరో 10లక్షలమంది ఆధారపడుతున్నారు.

ఆహార ధాన్యాలు, పాలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీ, ఆక్వా తదితర ఉత్పత్తులకు అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వారధుల్లాంటివి. రాష్ట్రంలో దాదాపు 500కు పైగా ఉన్న యూనిట్లలో ఏటా 40వేల కోట్ల రూపాయల వరకూ ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో 20వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతుంటాయి. అయితే ఆర్థిక మాంద్యం, ఇతరత్రా సమస్యల వల్ల గతేడాది నుంచే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని కరోనా తీవ్రంగా దెబ్బతీసింది.

ప్రభుత్వం నిబంధనలు సడలించి ఉత్పత్తికి అవకాశం కల్పించినా.. పనిచేసే వారు అందుబాటులో లేకపోవటం వల్ల పునరుద్ధరణ సాధ్యం కావట్లేదు. ప్రభుత్వం నుంచి ఈ పరిశ్రమలకు రావాల్సిన ప్రోత్సాహకాలు దాదాపు 100కోట్ల రూపాయల పైనే ఉంది. వెంటనే వీటిని విడుదల చేసి విద్యుత్ ఛార్జీల మినహాయింపు లాంటివి ఇచ్చి సహకరిస్తే కొంతైనా కోలుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం కరోనా చేసిన నష్టం ఈ రంగ భవిష్యత్తునే అంధకారంలోకి నెట్టేలా ఉందని ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరో ప్రధానమైంది మామిడి, జామ సీజన్. మూడు నెలలు మాత్రమే పూర్తిగా పని ఉండే ఈ యూనిట్లకు విదేశీ ఆర్డర్లు ఎక్కువ. దేశం నుంచి జరిగే విదేశీ ఎగుమతిలో మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే మామిడే ఎక్కువ. సరిగ్గా మామిడి సీజన్ లోనే కరోనా కాటు పడటంతో అనుబంధ పరిశ్రమలన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడింది.

ఈ ఏడాది ప్రారంభంలోనే ఎగుమతయ్యే మామిడి పల్ప్ మీద చక్కర పన్నును గల్ఫ్ దేశాలు విధించాయి. దీని వల్ల ఎంత మొత్తం ఉత్పత్తి జరుగుతుందో అంత మొత్తం స్థానికంగా పన్ను చెల్లించాలనే నిబంధన రావటంతో ఎగుమతులపై ప్రభావం పడింది. కృష్ణా-చిత్తూరు జిల్లాల్లోనే వీటి ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ. దాదాపు 50వరకూ ఉన్న యూనిట్లపై రైతులతో పాటు రైతు కూలీలు, ఉపాధి కార్మికులు, డ్రైవర్లు ఇలా లక్షమందిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఇప్పుడు అన్ని విధాలా నష్టపోయామని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

లాక్​డౌన్ నిబంధనల సడలింపు వల్ల ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అయిపోతోందనే ఆందోళనా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యక్తమవుతోంది. ఊరటనిచ్చామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం ఉత్పత్తి ప్రారంభమయ్యే వాతావరణం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి: తెలంగాణలో ఉద్రిక్తత... పోలీసులపై వలస కూలీల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.