ETV Bharat / city

పల్లెల్లో పడగ.. భారీగా పెరుగుతున్న కట్టడి ప్రాంతాలు!

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో వైరస్‌ ప్రభావం నగరాలు/పట్టణాల్లో ఎక్కువగా కనిపించగా.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను కరోనా వణికిస్తోంది. నిబంధనలను సడలించడం.. ప్రజారవాణా అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ప్రజల రాకపోకలు పెరుగుతుండటం వ్యాప్తికి కారణమవుతోంది.

corona effect on andhrapradesh villages
corona effect on andhrapradesh villages
author img

By

Published : Jun 5, 2020, 5:35 AM IST

ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి తిరిగి గ్రామాలకు చేరుతున్న వారి ద్వారానూ కొవిడ్‌ విస్తృతమవుతోంది. ప్రస్తుతం(ఈనెల 2నాటికి) రాష్ట్ర వ్యాప్తంగా 396 కట్టడి (క్లస్టర్‌) ప్రాంతాలు ఉండగా..వీటిలో గ్రామీణ నేపథ్యంతో ఉన్న మండలాలు 207 వరకు ఉండటం గమనార్హం. వైరస్‌ ఇంకా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించలేదని భావిస్తున్న తరుణంలో ప్రస్తుత కేసుల నమోదు వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. మాస్కుల ప్రాధాన్యాన్ని సరిగా గుర్తించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం తదితర కారణాలతో గ్రామాలలో వైరస్‌ వ్యాప్తి విస్తృతమవుతోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన ఒకరు గుంటూరు మార్కెట్‌లో కూరగాయల వ్యాపారిగా ఉన్నారు. ఆయనకి పాజిటివ్‌ రావడంతో ఆ గ్రామంలో ఆందోళన నెలకొంది.పల్లెల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

  • జిల్లాల వారీగా రూరల్, అర్బన్ కట్టడి ప్రాంతాలు
జిల్లా పేరురూరల్అర్బన్
శ్రీకాకుళం1 2
విజయనగరం 3 1
విశాఖపట్నం 5 29
తూర్పు గోదావరి 1519
పశ్చిమ గోదావరి 1216
కృష్ణా 1627
గుంటూరు 2114
ప్రకాశం 13 8
నెల్లూరు 34 26
చిత్తూరు 28 9
కడప 1010
అనంతపురం 14 10
కర్నూలు 1835 18
గ్రామీణ నేపథ్యమున్న కట్టడి ప్రాంతాలు
గ్రామీణ నేపథ్యమున్న కట్టడి ప్రాంతాలు

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 98 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.