రాష్ట్ర పరిపాలనా భవనంలో కరోనా భయం నెలకొంది. నాలుగు రోజుల్లో నలుగురు ఉద్యోగులు కరోనా సోకి మృతి చెందటంతో మిగిలిన వారు ఆందోళన చెందుతున్నారు. సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది శానిటైజ్ చేశారు. రోడ్ల వెంట బ్లీచింగ్ చల్లారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మహమ్మారి భయంతో ఉద్యోగులు సచివాలయానికి రాలేదు. వచ్చిన వారు కూడా ఆరుబయటే ఉండిపోయారు. దీంతో కార్యాలయం కళ తప్పింది.
ఇప్పటికే 50 మందికి పైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సచివాలయంలో ఈ-ఫైలింగ్ విధానం ఉండటంతో ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదని ఉద్యోగులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం.. బయటపడేదెలా?