ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా విలయ తాండవం...కొత్తగా 1062 కేసులు - ఏపీలో కొవిడ్ కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రమవుతోంది. బుధవారం నమోదైన 1062 కొత్త కేసులు కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య 22,259కి ఎగబాకింది. మరో 12 మంది మృతితో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 264కు చేరింది. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా విలయ తాండవం...కొత్తగా 1062 కేసులు

author img

By

Published : Jul 9, 2020, 6:01 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మూడురోజులుగా రెండు వందలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. బుధవారం 202 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఒక్క గుంటూరులోనే 97 కేసులు బయటపడ్డాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 2881కి చేరింది. తాడేపల్లిలో 31, నరసరావుపేటలో 23, తెనాలిలో 15 కేసులు నమోదయ్యాయి. మాచర్ల, మంగళగిరిలో ఐదేసి కేసులు, సత్తెనపల్లిలో 4, చిలకలూరిపేటలో 3 కేసులు చొప్పున బయటపడ్డాయి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్​ఎమ్​వో కరోనా బారిన పడి మృతిచెందారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ సైతం కరోనా బారినపడ్డారు. గుంటూరు నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సంబంధిత సచివాలయం పరిధిలోనే ప్రత్యేక బృందాల ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశించారు.

కడచూపు దక్కక..

గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి ప్రకాశం జిల్లాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు వైరస్‌ సోకింది. అతడి సోదరడికీ లక్షణాలు కనిపించాయి. ఇద్దరూ ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. మరో సోదరుడితో పాటు కుటుంబ సభ్యుల నలుగురిని గుంటూరు ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. ఇంతలో ఐసోలేషన్‌లో సోదరుడు గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహం తీసుకొచ్చేందుకు స్థానికంగా ఎవరూ లేక అక్కడే ఖననం చేశారు. ఈ విషాదంలో ఉండగానే రిమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో సోదరుడు మృతిచెందారు. కన్నవారికి, కట్టుకున్న వారికి కడచూపు దక్కలేదు. మరో సోదరుడు ఇంకా కోలుకోలేదు.

ఎంపీ గన్​మెన్, డ్రైవర్​కు కరోనా

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల కేంద్రంలో పాజిటివ్ కేసు రావడంతో దుకాణాలు మూసివేశారు. ప్రభుత్వ మద్యం దుకాణం మాత్రం తెరిచే ఉంచారు. కరోనా ఉద్ధృతి వేళ మద్యం దుకాణాలను ఎందుకు తెరుస్తున్నారని స్థానిక మహిళలు ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో ప్రస్తుతం 195 కరోనా కేసులు ఉండగా....గ్రామీణ ప్రాంత పరిధిలో 162 మందికి వైరస్‌ సోకింది. రెండు చోట్ల కలిపి 117 కంటైన్​మెంట్​ జోన్లు ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం పరిధిలోని హార్లిక్స్‌ ఫ్యాక్టరీలో ఓ ఉద్యోగి మృతిచెందగా...మరో 14 మందికి పాజిటివ్‌ వచ్చింది. కరోనా వ్యాప్తితో ఫ్యాక్టరీ మూతపడింది . కేసులు పెరుగుతున్నందున జనం జాగ్రత్తగా ఉండాలని సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అన్నారు. వచ్చే 2 నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలన్న ఎంపీ మార్గాని భరత్‌....తన గన్ మెన్, డ్రైవర్​కు కరోనా సోకిందని వెల్లడించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో కొవిడ్‌ నిబంధనలు పాటించని దుకాణదారులకు, మాస్కులు పెట్టకోకుండా రోడ్లమీదకు వచ్చే వారికి జరిమానాలు విధిస్తున్నారు.

ఇదీ చదవండి : ముఖ్యమంత్రి కార్యదర్శులకు శాఖల కేటాయింపులో సవరణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.