రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,970 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కొవిడ్ తో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,215కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,170 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 82 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,82,219కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 826 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,40,47,174 కరోనా సాంపుల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
ఇదీ చదవండి