రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల తీవ్రత పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 8,147 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 80,858కు చేరింది. వైరస్ బారిన పడి మరో 49 మంది మృతి చెందగా.. ఇప్పటివరకూ 933 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రుల్లో 39,990 మంది చికిత్స పొందుతుండగా.. 39,935 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకూ 15,41,993 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి..