AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ ధాటికి ముగ్గురు మృతిచెందినట్లు రాష్ట్ర వైద్యాఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 15,213 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 141 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కరోనా బారినుంచి తాజాగా 1,329 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,518 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
- భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 11వేల 499 నమోదు
Corona cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం భారీగా తగ్గింది . కొత్తగా 11,499 కేసులు నమోదయ్యాయి. 23,598మంది కోలుకున్నారు. మరో 255 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.01శాతానికి పరిమితమైంది. - మొత్తం మరణాలు: 5,13,481
- యాక్టివ్ కేసులు: 1,21,881
- కోలుకున్నవారు: 4,22,70,482
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య 1,77,17,68,379కి చేరింది.
World Corona cases: మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినా.. కరోనా వ్యాప్తి మాత్రం ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 16,10,287 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,32,97,210 మరణాలు.. 59,56,325కు చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో కొత్తగా 1,93,099 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 235 మంది కరోనాకు బలయ్యారు.
- రష్యాలో తాజాగా 1,23,460 కరోనా కేసులు నమోదయ్యాయి. 787 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 781 మంది చనిపోయారు. కొత్తగా 90,199 కేసులు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,65,889 మందికి వైరస్ సోకింది. 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి ధాటికి మరో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 58,138 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఇదీ చదవండి:
ఉక్రెయిన్‌లో దీనంగా తెలుగు విద్యార్థులు.. సరిహద్దులోని రోడ్డుపైనే వేలాదిమంది!