ETV Bharat / city

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తాత్కాలికమేనా? : కాంట్రాక్టు ఉద్యోగులు

ప్రభుత్వ నిర్ణయాల అమలులో శాశ్వత ఉద్యోగులతో సమానంగా...కొన్నిసార్లు ఎక్కువగానే కాంట్రాక్టు ఉద్యోగులు పని భారాన్ని మోస్తుంటారు. ఏనాటికైనా ఉద్యోగం పర్మినెంట్‌ అవకపోతుందా అనే ఆశతోనే జీతం తక్కువగా వస్తున్నా... జీవితాలను గుట్టుగా నెట్టుకు వస్తున్నారు.పాదయాత్ర సమయంలో వీరందరి కష్టాలను స్వయంగా చూసిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ అందరికీ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల సభల్లోనూ అదే హామీని పునరావృతం చేశారు.ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు దాటినా తమకిచ్చిన హామీ నెరవేర్చ లేదని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు.

Contract employees
కాంట్రాక్టు ఉద్యోగులు
author img

By

Published : Sep 7, 2021, 4:32 AM IST

కాంట్రాక్టు ఉద్యోగులు... పేరుకు తాత్కాలిక ఉద్యోగులైనా ప్రభుత్వ నిర్ణయాల అమలులో కీలకంగా వ్యవహరిస్తుంటారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా... కొన్నిసార్లు ఎక్కువగానే పని భారాన్ని మోస్తుంటారు. ఏనాటికైనా ఉద్యోగం పర్మినెంట్‌ అవకపోతుందా అనే ఆశతోనే జీతం తక్కువగా వస్తున్నా... జీవితాలను గుట్టుగా నెట్టుకు వస్తున్నారు. తమ కుటుంబాల్లో పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలతో అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 13 వేల మంది వరకు ఉన్నారు. పాదయాత్ర సమయంలో వీరందరి కష్టాలను స్వయంగా చూసిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ అందరికీ న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల సభల్లోనూ అదే హామీని పునరావృతం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక సచివాలయంలో ఉద్యోగ సంఘాలు కలిసిన సందర్భంలోనూ ఇదేమాట చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు దాటినా తమకిచ్చిన హామీ నెరవేర్చ లేదని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు.
అనేకసార్లు ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు విన్నవించి ఆఖరికి ఉద్యమబాట పట్టారు. దాదాపు 96 రోజుల నుంచి ఒక్కోరోజు ఒక్కో జిల్లా కేంద్రంలో ఆందోళన కొనసాగిస్తున్నారు.

పాదయాత్రలో..
మీ అందరి కష్టాలను స్వయంగా చూశా. అందరికీ న్యాయం చేస్తా.

మేనిఫెస్టోలో..
అన్ని ప్రభుత్వశాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసులను పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం.

సీఎం అయ్యాక..
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను సానుకూలంగా పరిష్కరిస్తాం. అందరికీ న్యాయం చేస్తాం.

ప్రస్తుత పరిస్థితి
రెండేళ్లయినా హామీ నెరవేరలేదనే ఆవేదనతో 96 రోజులుగా కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అధ్యయనం చేసేందుకు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. 2019, జులై 10న సంబంధిత ఉత్తర్వులను నాటి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం వెలువరించారు. రాష్ట్ర ఆర్థిక, అటవీ-ఇంధన, వైద్య-కుటుంబ సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ పరిపాలన, విద్యాశాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటైంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించే అంశంతోపాటు ఇతర అనుబంధ అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
  • 2019, నవంబరులో ఉన్నతాధికారులతో మరో కమిటీ వేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మంత్రివర్గ సంఘానికి తగిన సలహాలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, ఆర్థిఖశాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా మరో అయిదుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైంది.
  • అధికారుల కమిటీకి 2020 మార్చి 31 వరకు గడువు విధించారు. అనంతరం 2020, జూన్‌ 30 వరకు పొడిగించారు. ఈ గడువు దాటి ఏడాదైనా నివేదిక సమర్పించలేదు. మంత్రుల కమిటీ సైతం సిఫార్సులేమీ చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులేమో ప్రభుత్వం నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
  • ఉన్నతాధికారుల కమిటీ చివరిసారిగా 2020, జూన్‌ 6న సమావేశమైంది. ఆగస్టు ప్రారంభంలో సీఎస్‌ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో ఆ కమిటీ విషయమూ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
  • తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి 2021 జూన్‌ 18న ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చింది. 2003లో కాంట్రాక్టు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ఉత్తర్వుల్లోని సారాంశాన్ని మళ్లీ రెండు జీవోలుగా వెలువరించింది. సీఎం జగన్‌ ఇటీవల ఆగస్టు 15న తన ప్రసంగంలో కాంట్రాక్టు ఉద్యోగులకు తాము టైంస్కేల్‌ ఇచ్చామని తెలిపారు. నిజానికి టైంస్కేలు 2019 కన్నా ముందే వర్తింపజేశారని, కొత్తగా ఇచ్చిన జీవోలతో తమకు ఒనగూరిందేమీ లేదని సంఘం నాయకులు పేర్కొంటున్నారు.

అర్హతలున్నా.... క్రమబద్ధీకరించరేమి?

పరీక్షలు రాసి, డీఎస్సీ ద్వారా ఎంపికయ్యాం. ఉమాదేవి వర్సెస్‌ కర్ణాటక ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని స్పష్టం చేసింది. పరీక్ష రాసి, జిల్లా/జోన్‌/ రాష్ట్ర స్థాయి కమిటీల ద్వారా ఎంపికై, పదేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగిగా సర్వీసు ఉన్న వారిని రెగ్యులర్‌ చేయాలంది. ఇప్పటికే ఔట్‌ సోర్సింగు ఉద్యోగులను ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకువెళ్లారు. పారా మెడికల్‌, జూనియర్‌ కాంట్రాక్టు లెక్చరర్లుతోపాటు ఇతర విభాగాల్లోని మమ్మల్నందర్నీ రెగ్యులర్‌ చేయాలి.

కలుస్తూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం

ప్రతినెలా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర ప్రభుత్వ ముఖ్యులు, సీఎస్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వంటి వారిని కలుస్తూనే ఉన్నాం. ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగానే ఉంటుందని వారు చెబుతున్నారు. కానీ అలాంటి ఫైలు ఒకటి సిద్ధం చేస్తున్న ప్రయత్నాలు మాత్రం కనిపించడం లేదు. దాంతో మేం హైకోర్టును ఆశ్రయించాం. తీర్పు రావాల్సి ఉంది. వైద్యారోగ్య శాఖలోని 11 పారా మెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి 96 రోజులుగా పోరాడుతున్నాం. ప్రభుత్వం మా మొర వినాలి. - జాన్‌ హెన్రీ , పారా మెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగుల ఐకాస కన్వీనర్‌

క్రమబద్ధీకరణ చేయకుంటే పోరాటమే

ప్రభుత్వ కళాశాలలన్నీ కాంట్రాక్టు లెక్చరర్లపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ప్రస్తుతం నాడు-నేడు పేరిట భవనాల నిర్మాణంతోపాటు వసతులనూ సమకూరుస్తున్నారు. వసతులతోపాటు చదువులూ ముఖ్యమే. ఇటీవల ఎయిడెడ్‌ కాలేజీల లెక్చరర్లను ప్రభుత్వంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాగైతే మా భవితవ్యం ఏమిటి? ఇదే విషయమై అన్ని సంఘాలతో చర్చించి, ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. - బి.జె.గాంధీ, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్‌

వేతనాల వేదన

వైద్యారోగ్యశాఖలో ఆయనొక హెల్త్‌ సూపర్‌వైజరు. ఉద్యోగానికి అవసరమైన పరీక్ష రాసి, ఉత్తీర్ణత సాధించి, జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎంపికై 2003లో కాంట్రాక్టు(తాత్కాలిక) ఉద్యోగంలో చేరారు. ఆయన ప్రస్తుత జీతం రూ.28,000. అంతకంటే నాలుగేళ్ల ముందు అంటే 1999లో అదే శాఖలో అదే ఉద్యోగానికి శాశ్వత ఉద్యోగిగా ఎంపికైన హెల్త్‌ సూపర్‌వైజరుకు జీతం రూ.90 వేలు వస్తోంది. ‘‘ఇద్దరం చేసేది అదే పని, ఇద్దరి విధులూ ఒకటే. వారిది శాశ్వత ఉద్యోగం. మాది కాంట్రాక్టు. మా జీతభత్యాల్లోని ఈ వ్యత్యాసంతో మా జీవితాలకు, భవిష్యత్తుకు భరోసా లేకుండా పోయింది’’ అని కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

చనిపోతున్నా సాయం లేదు

కాంట్రాక్టు ఉద్యోగులు కొందరు సర్వీసులో ఉండగానే చనిపోయారు. మరికొందరు ఉద్యోగ విరమణ చేశారు. అలాంటి వారి కుటుంబాలు ప్రస్తుతం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే సాధారణ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల సాయం ఇవ్వాలని గతంలోనే జీవో ఇచ్చారు. ఒక్క పారా మెడికల్‌ విభాగంలోనే 43 మంది మృతిచెందారు. నిధులు లేవంటూ పరిహారం మంజూరు చేయడంలేదని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదీ చదవండి

dgp letter to cs: పోలీసేతర విధులను మహిళా పోలీసులకు అప్పగించొద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.