చేయూత పథకం లబ్దిదారుల అంశంపై హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు ఆదేశించి ఏడాది గడిచిన పథకం అమలు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. కృష్ణాజిల్లా చందర్లపాడులో 20 మందికి అమలు చేయలేదని పిటిషన్లో వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో చేయూత రెండో విడత మెుత్తాన్ని అధికారులు జమ చేశారు.
అయితే తొలివిడత మెుత్తం ఇవ్వకపోవడంతో కోర్టులో ప్రభాకర్ అనే వ్యక్తి ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు వస్తుందని తెలిసి రాత్రి తొలివిడత మెుత్తాన్ని అధికారులు వేశారు. అప్పటి అధికారులు ఇంతియాజ్, శ్రీనివాస్ హాజరకుకాకపోవడంపై కోర్టు అంతృప్తి వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: