మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసినటువంటి గొప్ప పనులు నిరంతరం మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయని తులసి రెడ్డి అన్నారు. ఏ పని ఇచ్చినా ఆ పదవికే అలంకారంగా ఆయన ఉండేవారన్నారు. ఒక నిరంతర విద్యార్థిగా ఉండేవారని.. నిజాయితీకి ఒక నిలువెత్తు ప్రదర్శనంగా ఉండేవారని కొనియాడారు.
పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ప్రణబ్ తో కలిసి పనిచేసిన అనుభవాలను పల్లం రాజు గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: 'భారతరత్నం'.. నీ ప్రస్థానం ఎంతో ఘనం!