గౌతం రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గౌతమ్ రెడ్డి సౌమ్యులు, సంస్కారవంతులని.. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన నాయకుడని చెప్పారు. అతని తాత నుంచి వారి మంత్రి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న వెంకయ్య.. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
గౌతమ్‌రెడ్డి మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్న ఆయన.. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌కు సీఎం జగన్..
మంత్రిమేకపాటి గౌతమ్‌రెడ్డిహఠాన్మరణంపై ముఖ్యమంత్రిజగన్ తీవ్ర దిగ్భ్రాంతివ్యక్తం చేశారు. మరణవార్త తెలియగానే విషాదంలోమునిగిపోయారు. ప్రభుత్వప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ,డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి,పార్టీ నేతలువిజయసాయిరెడ్డి,వై.వి.సుబ్బారెడ్డి,శ్రీకాంత్‌రెడ్డి,ఉన్నతాధికారులుఆరోఖ్యరాజ్, ముత్యాలరాజు,ధనుంజయరెడ్డితోతన నివాసంలో సమావేశమయ్యారు.గౌతంరెడ్డితోతనకున్న అనుబంధాన్ని జగన్గుర్తుచేసుకున్నారు.చిన్ననాటి నుంచేతనకు బాగా పరిచయమున్నగౌతమ్‌రెడ్డిని కోల్పోవడంపట్ల ముఖ్యమంత్రి ఆవేదనచెందారు. ఒకస్నేహితుడినే కాకుండా సమర్థుడైనమంత్రిని, విద్యాధికుడ్నిపోగొట్టుకున్నామని అన్నారు.రాజకీయ ప్రయాణంలోతోడుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.రాష్ట్రంలోపారిశ్రామిక, ఐటీఅభివృద్ధికి విశేష కృషిచేశారని కీర్తించారు.పారదర్శక పారిశ్రామికవిధానాల అమలుతో రాష్ట్రానికిమంచి గుర్తింపు తెచ్చారనిఅన్నారు. రెండుసార్లుఆత్మకూరు నియోజకవర్గం నుంచిప్రజల ఆదరాభిమానాలతో గెలుపొందినగౌతమ్‌రెడ్డి ఉజ్వల భవిష్యత్తుఉందని... ఆయనమరణం తనతోపాటు పార్టీకి,రాష్ట్రానికి తీరనిలోటన్నారు. అనంతరంగన్నవరం విమానాశ్రయం నుంచిహైదరాబాద్‌కు బయల్దేరారు.విజయసాయిరెడ్డి,వై.వి.సుబ్బారెడ్డి,ధనుంజయరెడ్డి సీఎంవెంట ఉన్నారు. హైదరాబాద్‌లోనినివాసంలో గౌతమ్‌రెడ్డిభౌతికకాయానికి సీఎం నివాళులుఅర్పిస్తారు.
మంత్రి మేకపాటి మృతి పట్ల చంద్రబాబు సంతాపం
మంత్రి గౌతం రెడ్డి మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఎంత భవిష్యత్ ఉన్న గౌతం రెడ్డి బాధాకరమన్న చంద్రబాబు.. తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపట్ల పవన్‌కల్యాణ్, బాలకృష్ణ దిగ్భ్రాంతి
ప్రజలకు సేవా చేయాలనే మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ఆవేదన కలిగించిందన్నారు పవన్‌కల్యాణ్. ఇక ఇవాళ జరగాల్సిన పవన్ కల్యాణ్ నూతన చిత్రం 'భీమ్లానాయక్' ప్రీరిలీజ్ వేడుకను వాయిదా వేశారు. గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా 'భీమ్లానాయక్' ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు... సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రకటించింది.
మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలచివేసిందని.. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన చనిపోయారన్న వార్త వినడానికే చాలా బాధగా ఉందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరితోనూ స్నేహంగా మెలిగేవారని గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పని చేసేవారని... ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు చిరస్మరణీయమని బాలకృష్ణ కీర్తించారు.
ఆత్మకూరులో విషాదఛాయలు..
మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న అభిమానులు... ప్రజల కోసం ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఇదీ చదవండి:
Gowtham Reddy No more: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి