పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(పాడా) పై సీఎం జగన్ సమీక్షించారు. పులివెందుల వైద్య కళాశాల శంకుస్థాపన, పనుల పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరగా పూర్తిగా చేయాలని ఆదేశించారు. ఈ ఏడాదిలోగా వైద్య కళాశాల పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
జీఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కెనాల్ - చక్రాయపేట ఎత్తిపోతల పనుల పురోగతిపై సమీక్షించిన జగన్... యుద్ధప్రాతిపదికన పనులు గ్రౌండింగ్ కావాలని అధికారులను ఆదేశించారు. నెలాఖరుకల్లా జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తిచేసి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వేంపల్లి మండలం అలవలపాడు, పెండ్లూరు చెరువు, జీఎన్‌ఎస్‌ఎస్ నుంచి పీబీసీ కెనాల్‌కు పనులకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. గండికోట, చిత్రావతి రిజర్వాయర్లలో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నిల్వకు ఆదేశించారు. అరటి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్ ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలని జగన్ సూచించారు.
ఇదీ చదవండి: