కరోనా కట్టడి, వరద సహాయక చర్యలపై.. ముఖ్యమంత్రి జగన్.. నేడు ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సీఎం తెలుసుకోనున్నారు. అలాగే.. స్పందన, సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చిస్తారు.
అనంతరం.. వ్యక్తిగత పనులపై బెంగళూరు వెళ్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం.. సాయంత్రం 4 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. ఎలహంకలోని తన నివాసానికి వెళ్తారు.