క్షేత్రాభివృద్ధి పరిశీలనతోపాటు ఆలయ ఉద్ఘాటన మహూర్త తేదీలు ప్రకటించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr visit yadadi)... మరోసారి యాదాద్రిలో పర్యటిస్తున్నారు (cm kcr visit yadadi). 16వ సారి విచ్చేస్తున్న సీఎం పర్యటన కోసం (cm kcr visit yadadi)... అధికారులు, ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గండిచెరువుతోపాటు పట్టణ పరిసరాల్లోని దారుల్లో మట్టిని తొలగించే పనులు చేపట్టారు. కనుమదారుల్లో యాడా ఆధ్వర్యంలో... ఇరువైపులా హరితమయం సాక్షాత్కరించేలా వివిధ రకాల మొక్కలు నాటారు. అయితే... హెలికాప్టర్ ద్వారానా లేక... రోడ్డు మార్గాన వస్తారా అన్నది తేలాల్సి ఉంది (cm kcr visit yadadi). అయితే పెద్దగుట్టపై ఆలయ నగరి ప్రాంగణంలో నిర్మితమైన హెలిప్యాడ్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ కాంతుల ధగధగల ఏర్పాట్లను... ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పరిశీలించారు. గత జూన్ 21న క్షేత్రాన్ని సందర్శించిన సీఎం (cm kcr visit yadadi)... అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు.
తుదిదశకు చేరుకున్న నిర్మాణ పనులు
క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పుణ్యస్నానాల కోసం... కొండ కిందనున్న గండిచెరువు వద్ద 2.20 ఎకరాల్లో లక్ష్మీ పుష్కరిణి రూపొందింది. 11.55 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు... 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే అందులో నీటిని నింపి ట్రయల్ రన్ పూర్తి చేశారు. భక్తుల బస కోసం 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో... రూ.8.35 కోట్లతో నిర్మిస్తున్న మండప భవనం పనులు 95 శాతం పూర్తయ్యాయయాయి (yadadri development works) రూ.20.30 కోట్లతో 2.23 ఎకరాల్లో చేపట్టిన కల్యాణకట్ట తుది దశకు చేరుకుంటుండగా... ఆర్నమెంటల్ పనులు, 2.59 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండప నిర్మాణంలో పునాదుల పనులు జరుగుతున్నాయి. క్షేత్ర సందర్శనకు వచ్చే దేశ, విదేశీయుల విడిది కోసం... దాతల విరాళాలు రూ.104 కోట్లతో నిర్మితమవుతున్న ప్రెసిడెన్షియల్ సూట్లలో 14 విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్ భవనం పూర్తయింది.
శరవేగంగా..
రూ.13 కోట్ల వ్యయంతో.. ప్రసాదాల తయారీ, విక్రయ కాంప్లెక్స్‌లో యంత్రాలను బిగించగా... స్వామివారి దర్శనానికొచ్చే భక్తుల కోసం... నాలుగు వేల మంది వేచి ఉండేలా కింది అంతస్తు సహా నాలుగంతస్తుల సముదాయాన్ని విస్తరించి, ఉత్తర దిశలో మందిర ఆకార హంగులతో తీర్చిదిద్దుతున్నారు. మాడ వీధిలో స్వర్ణ వర్ణంతో కూడిన ప్రత్యేక దర్శన వరుసలు పూర్తయ్యాయి. శివాలయం ప్రహరీ ఎత్తును తగ్గించి... దిమ్మెలపై ఇత్తడి తొడుగులు, వాటిపై త్రిశూలం తరహాలో లైటింగ్ ఏర్పాట్లున్నాయి. ఎదురుగా స్వాగతతోరణం, రథశాల, గార్డెన్ పనులు నడుస్తున్నాయి. విష్ణుపుష్కరిణి పునరుద్ధరణ పనులు కొనసాగుతుండగా... బస్ బే కోసం బండ తొలగింపుతోపాటు చదును చేసే పనులు జరుగుతున్నాయి. కొండపై ఉత్తర దిశలో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి.
ఇదీ చూడండి: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు జెన్కో రాసిన లేఖలో ఏముంది?