ETV Bharat / city

తెలంగాణలో తాగు నీళ్లు ఉచితం.. డిసెంబర్ నుంచి అమలు - తెరాస జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో వార్తలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా... తెరాస ఆకర్షణీయ హామీలతో ముందుకొచ్చింది. ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అంశంగా ప్రచారం సాగిస్తున్న గులాబీ పార్టీ.. జీహెచ్​ఎంసీలో గెలిపించాలంటూ.. హామీల వర్షం కురిపించింది. తెరాసను గెలిపిస్తే డిసెంబరు నుంచే హైదరాబాద్​లో ఉచితంగా మంచి నీటి సరఫరా చేస్తామని అధికార పార్టీ సరికొత్త పథకాన్ని ప్రకటించింది.

cm-kcr-released
cm-kcr-released
author img

By

Published : Nov 24, 2020, 7:37 AM IST

Updated : Nov 24, 2020, 9:16 AM IST

తెలంగాణ: ఆకర్షణీయ హామీలతో తెరాస జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో

తెలంగాణ.. జీహెచ్​ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఆకర్షణీయ హామీలతో మేనిఫెస్టో ప్రకటించింది. వివిధ వర్గాల ఆకాంక్షలు, వినతులను పరిగణనలోకి తీసుకొని.. సుదీర్ఘ కసరత్తు చేసి ఎన్నికల హామీ ప్రణాళికలను ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత మంచినీటి సరఫరా ఈ సారి తెరాస మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా నిలిచింది. దిల్లీ తరహాలో డిసెంబరు నుంచే ఉచితంగా మంచి నీటిసరఫరా చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 20 వేల లీటర్ల లోపు నల్లా నీళ్లు వినియోగించే వారు.. డిసెంబరు నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

సమగ్ర జీహెచ్​ఎంసీ చట్టం

గ్రేటర్ హైదరాబాద్​లో మైరుగైన, సమర్థమైన పాలన కోసం సమగ్ర జీహెచ్​ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామని మేనిఫెస్టోలో తెరాస ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, దోబీఘాట్‌లు, లాండ్రీలకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా హామీ ఇచ్చింది. కరోనా కాలానికి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 37 వేల 611 వాహనాలకు.. రెండు త్రైమాసికాల వాహనపన్ను 267 కోట్లు రద్దు చేస్తామని తెలిపింది. సినిమా థియేటర్లు సహా వ్యాపార సంస్థలకు ఆరు నెలల కరోనా కాలంలో కనీస విద్యుత్ చార్జీలను మాఫీ చేస్తామని కేసీఆర్​ తెలిపారు. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తీసే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీయెంబర్స్‌మెంట్‌ను అందిస్తామని తెలిపారు. టికెట్‌ ధరలు సవరించుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక

జీహెచ్​ఎంసీలో 13వేల కోట్ల రూపాయలతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 12వేల కోట్లతో సమగ్ర వరద నీటి నిర్వహణ ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొంది. మూసీని గోదావరితో అనుసంధానం చేసి శుద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. సుమారు 5వేల కోట్ల రూపాయలతో మూసీని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు గోదావరి నీళ్లను తరలిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

మెట్రోరైలు ప్రాజెక్టును రెండోదశ

ఇప్పుడున్న బాహ్యవలయ రహదారికి అవతల మరో ప్రాంతీయ వలయదారిని నిర్మిస్తామని ప్రకటించింది. మెట్రోరైలు ప్రాజెక్టును రెండోదశలో రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహిదీపట్నం వరకు విస్తరిస్తామని తెలిపింది. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్​ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. 125 లింకురోడ్లను నిర్మించడం సహా.. ఐదేళ్లలో ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ వ్యవస్థను తీసుకురాబోతున్నామనివెల్లడించింది.

చెరువుల సుందరీకరణ

జీహెచ్​ఎంసీ పరిధిలో 185 చెరువుల్లో 20 సుందరీకరణకు 250 కోట్లతో.. హెచ్​ఎండీఏ పరిధిలో 20 చెరువులను 120 కోట్లలో సుందరీకరిస్తున్నామని తెరాస మేనిఫెస్టోలో తెలిపింది. గచ్చిబౌలి టిమ్స్‌ తరహాలో మరో మూడింటిని అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపింది. ఇప్పటికే ఉన్న 5 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా మరో 5లక్షల కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లించింది. వివాదాస్పద, ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారి స్థలాలు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది.

ఇదీ చదవండి: సూర్యలంకలో నేటి నుంచి క్షిపణి పరీక్షలు

Last Updated : Nov 24, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.