ETV Bharat / city

CM KCR: ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం: కేసీఆర్ - CM KCR fire on Central

Telangana CM KCR fires on Central Govt: ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షేపించారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాల సిద్ధాంతంతో ముందుకెళ్తుందని ఆరోపించారు. హైదరాబాద్​లోని పబ్లిక్ గార్డెన్స్​లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్​ ప్రసంగించారు.

Telangana CM KCR fires on Central Govt
author img

By

Published : Jun 2, 2022, 3:28 PM IST

CM KCR on Telangana Formation Day Celebrations: రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు కేంద్రం పాల్పడుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రగతిశీల రాష్ట్రంపై కేంద్ర వైఖరి చాలా బాధాకరమన్నారు. కేంద్రం అనేక విషయాల్లో రాష్ట్రంపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్​లోని పబ్లిక్ గార్డెన్స్​లో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం: కేసీఆర్

'రాష్ట్ర ప్రభుత్వ విన్నపం బధిర శంఖారావంగా మారడం విషాదకరం. రాష్ట్ర వడ్లు కొనాలని నాతో సహా అందరూ దిల్లీలో ధర్నా చేశాం. నూకలు తినాలన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలు బాధించాయి. రైతులతో చెలగాటం ఆడే ధోరణి వీడాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతోంది. బలమైన కేంద్రం.. బలహీనమైన రాష్ట్రాల సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలు తెలంగాణకు గుదిబండగా మారాయి. మీటర్ల విషయంలో రైతులపై భారం వేసేందుకు మేం సిద్ధంగా లేం. అన్నిరకాల వనరులున్న మనదేశం ఇంకా ఎందుకిలా ఉంది?' - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు కోరినా నయాపైసా ఇవ్వలేదని కేంద్రంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. విభజన చట్టం హామీలన్నీ బుట్టదాఖలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.