ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu), గవర్నర్ బిశ్వభూషణ్Governor Bishwabhushan Harichandan), సీఎం జగన్(CM Jagan) దీపావళి శుభాకాంక్షలు (diwali wishes)తెలిపారు. భారత్‌లో ప్రతీ పండుగ.. మన సంస్కృతిని గుర్తుచేస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) అన్నారు. సత్యం, ధర్మం, న్యాయం, దయ, కరుణ కలిస్తే.. శ్రీరాముడు అని ఉపరాష్ట్రపతి తెలిపారు. సమృద్ధికి సూచికైన లక్ష్మీదేవిని పూజించడం దీపావళి విశిష్టత అన్నారు. ఈ దీపావళి.. అందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని వెంకయ్యనాయుడు (Vice President Venkaiah Naidu)ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయం: గవర్నర్
ప్రజలందరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలని.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Governor Bishwabhushan Harichandan) ఆకాంక్షించారు. దీపావళి వేడుకను పురస్కరించుకని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు (diwali wishes)తెలిపారు. దీపావళి దివ్య కాంతులు ప్రతి ఒక్కరి జీవితంలోనూ శాంతి, శ్రేయస్సు, ఆనందాలను అందించాలని అభిలషించారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని దీపావళి సూచిస్తుందని, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు గవర్నర్ అన్నారు.
సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలి: సీఎం జగన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్(CM Jagan) దీపావళి (diwali wishes)శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. తెలుగు ప్రజలకు సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని సీఎం జగన్(CM Jagan) ఆకాంక్షించారు.
ఇదీ చదవండి