ETV Bharat / city

LAND REGISTRATIONS:37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించనున్న సీఎం

LAND REGISTRATIONS:వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకం కింద రీ సర్వే చేసిన గ్రామాల భూ రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రజలకు అంకితమివ్వనున్నారు. వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా....మొదటి దశలో 51 గ్రామాల్లోని 12 వేల 776 మంది భూ యజమానుల భూములను రీ సర్వే చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించనున్న సీఎం

author img

By

Published : Jan 18, 2022, 3:44 AM IST

LAND REGISTRATIONS: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు , భూరక్ష పథకం కింద రీ సర్వే చేసిన గ్రామాల భూ రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రజలకు అంకితమివ్వనున్నారు. వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వేలో భాగంగా....మొదటి దశలో 51 గ్రామాల్లోని 12 వేల 776 మంది భూ యజమానుల భూములను రీ సర్వే చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 21 వేల 404 భూ కమతాలకు సంబందించిన 29 వేల 563 ఎకరాల భూములను రీసర్వే చేసి...3వేల304 అభ్యంతరాలను పరిష్కరించినట్లు వివరించింది. రీ సర్వే చేసిన భూమి రికార్డులను నేడు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తిచేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇవాళ 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలను సీఎం ప్రారంభించనున్నారు. జూన్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:

కరోనా చికిత్సకు రెమ్​డెసివిర్​, టోసిలిజుమాబ్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.