ETV Bharat / city

పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్ - latest news of corona in ap

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి పట్టణ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రెండంచెలుగా కరోనా సంక్రమణ నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమీక్ష నిర్వహించారు. రేషన్ దుకాణాల వద్ద జనం గుమిగూడుతున్నందున పంపిణీ కేంద్రాలను పెంచాలన్నారు.

cm-jagan-video-conference-with-collectors-sps

author img

By

Published : Mar 30, 2020, 7:08 PM IST

పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి:సీఎం జగన్

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని .. ఆ ప్రాంతాలపై దృష్టి సారించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు జనసాంద్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వ్యాప్తి ఎక్కువగా ఉందని సీఎం స్పష్టం చేశారు. రెండంచెలుగా ఈ వ్యాప్తికి సంబంధింన అంశాలను పర్యవేక్షించనున్నట్టు సీఎం వెల్లడించారు.

పరిస్థితులు అదుపులో ఉండాలి

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులను కఠినంగా అమలు చేయాల్సిన అవసరముందని తెలిపారు. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రంలో గట్టి చర్యలే చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలంతా వ్యాప్తి నిరోధకం కోసం ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌ను పాటించకపోతే లక్ష్యం నెరవేరదని చెప్పారు. అర్బన్‌ ప్రాంతాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉండాలని.. కలెక్టర్లతోపాటు మున్సిపల్‌ కమిషనర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. మొదటి దశ టీంలో వార్డు వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల ప్రైమరీ రిసోర్స్‌ పర్సన్లు, వార్డు సచివాలయంలో ఉండే హెల్త్‌ సెక్రటరీ, అదనపు ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారని.. విదేశాలనుంచి వచ్చిన వారు ఉన్నా, లేకున్నా.. ప్రతి ఇంటిమీదా వీరు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లాలో 5వేల పడక కేంద్రాలు

కరోనా వైరస్ సోకినప్పటికీ ఇంట్లోనే వైద్యం తీసుకుంటూ కోలుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని.. అందువల్ల ఎవ్వరూ భయపడొద్దని సీఎం సూచించారు. వృద్ధులతో పాటు రక్తపోటు, మధుమేహం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని చెప్పారు. అందుకే ప్రాథమిక, రెండో స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ బృందాలు బాగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. విశాఖలో విమ్స్, కృష్ణా జిల్లాలో సిదార్థ హాస్పిటల్, నెల్లూరులో జీజీహెచ్, తిరుపతిలో పద్మావతి ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ జిల్లా కలెక్టర్లు వీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఇక క్వారంటైన్‌ కోసం ప్రతి జిల్లాలో 5వేల పడక కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ప్రతీ క్వారంటైన్ కేంద్రం వద్ద వైద్య బృందం ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.

అక్వా రంగానికి ఇబ్బంది రాకుండా చూడాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. రబీ పంట వస్తున్న దృష్ట్యా మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరింకుండా చూడాల్సిందిగా సూచించారు. వ్యవసాయ ఉత్పతుల రవాణాపై ఎలాంటి ఆంక్షలూ లేవని సీఎం స్పష్టం చేశారు. దిగువ స్థాయి పోలీసుల వరకూ కూడా ఈ సమాచారం వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. రేషన్‌ దుకాణాల వద్ద జనం గుమిగూడుతుండడంపై స్పందించారు. సమస్య పరిష్కారానికి పంపిణీ కేంద్రాల సంఖ్య పెంచాలని సూచించారు.

ఇదీ చదవండి:

'సమస్యలుంటే ఈ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.