ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ! - ఏపీలో పాక్షిక లాక్ డౌన్

partial lockdown at ap
రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
author img

By

Published : May 3, 2021, 1:33 PM IST

Updated : May 4, 2021, 1:57 AM IST

13:29 May 03

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న కర్ప్యూ సమయం పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ప్యూ అమలు చేస్తుండగా.. రేపటి నుంచి సమయాన్ని మరింత పెంచనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కర్ప్యూ అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రేపటి నుంచి 2 వారాలపాటు ఈ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రతి రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతిస్తారు. దుకాణాలు తెరిచి ఉంచే సమయంలోనూ 144 సెక్షన్‌ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎక్కువ మంది గుమి కూడకుండా, రద్దీ నివారణకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేసుల సంఖ్యను తగ్గించేలా మరింత కఠినంగా నిబంధనలను అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తూ కింది స్థాయిలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. కొవిడ్ ను నివారించేలా పాక్షికంగా కర్ప్యూను అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:

ఆక్సిజన్​ సరఫరాలో సాంకేతిక లోపం.. 8 మంది కరోనా రోగుల మృతి

Last Updated : May 4, 2021, 1:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.