ETV Bharat / city

'స్పందన'పై 59 శాతం మంది సంతృప్తి: సీఎం జగన్

'స్పందన' కార్యక్రమ అమలు వివరాలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో చర్చించారు. సమస్యలు బాగా పరిష్కరించారని 59 మంది శాతం... మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చని 41 శాతం మంది చెప్పినట్లు పేర్కొన్నారు.

cm jagan review on 'Spandana'
author img

By

Published : Sep 11, 2019, 8:56 PM IST

cm jagan review on 'Spandana'
స్పందనపై 59 శాతం మంది సంతృప్తి: సీఎం జగన్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమం, వస్తున్న ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. సమస్యల పరిష్కారంపై బాధితులకు ఫోన్లు చేసి అభిప్రాయాలు స్వీకరించామని అధికారులకు తెలిపారు. సమస్యలు బాగా పరిష్కరించారని 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మరింత మెరుగ్గా పరిష్కరించవచ్చని 41 శాతం మంది చెప్పినట్లు పేర్కొన్నారు. జిల్లాల నుంచి ఎంపిక చేసుకున్న కొంత మంది అధికారులను పిలిపిస్తామని... వినతుల్లో భాగంగా వారు ఇచ్చిన సమాధానాలను వారికే చూపిస్తామని తెలిపారు. ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించి వర్క్‌షాపు నిర్వహిస్తామని ప్రకటించారు. వినతులు ఇచ్చే ప్రజల పట్ల కొందరు సిబ్బంది సవ్యంగా ప్రవర్తించడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయని.. అలాంటి కేసులు 2 శాతం నుంచి 5 శాతం వరకూ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నామన్న వాస్తవాన్ని క్షేత్రస్థాయి అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.

మనం సేవకులం...పాలకులం కాదు...

ప్రజలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చామని అధికారులతో ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మనం సేవకులమే కాని, పాలకులం కాదని వ్యాఖ్యానించారు. వినతులు, సమస్యలు నివేదించే వారి పట్ల చిరునవ్వుతో ఆహ్వానించాలని సూచించారు. స్పందన స్ఫూర్తి తగ్గకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం.. గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని మరిచిపోవద్దనన్నారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ rx7 6 8 మొబైల్ నెంబర్ rx 99 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలిలో చలో ఆత్మకూరు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ముందస్తుగా అరెస్ట్ చేసి ఇ పోలీసులు స్టేషన్ కి తరలింపు

note డస్క్ వాట్సాప్ విజువల్స్ వచ్చినాయి గమనించగలరు

Conclusion:గుంటూరు జిల్లాలో తెదేపా నాయకుల అరెస్టు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.