CM Jagan Review on PRC: ఉద్యోగులకు వేతన సవరణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఈ భేటీకి సీఎస్, ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల హాజరయ్యారు. పీఆర్‌సీ, ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారంపై చర్చించారు. ఉద్యోగులకు ఎంతశాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరిపారు.
ఫిట్‌మెంట్‌తో బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందో అనే దానిపై అధికారులు నివేదిక ఇచ్చారు. 14.29 శాతం దాటి ఎంత పెంచితే ఎంత భారమనే అంశంపై వివరించారు. నేడు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చలు జరిపే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చల్లో ముఖ్యమంత్రి.. ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగ సంఘాలకు సమాచారం..
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. పీఆర్సీపై ఉన్నతస్థాయిలో చర్చలకు సిద్ధంగా ఉండాలని.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉందని.. అంతకుముందు సీఎంతో మరోమారు ఆర్థికశాఖ అధికారులు భేటీ కానున్నారు. పీఆర్సీ కమిషన్ నివేదికలో పేర్కొన్న ప్రతిపాదనలపై చర్చించనున్నారు. మరోవైపు రేపు ఉదయం 10.30కు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు భేటీ కానున్నారు.
ఇదీ చదవండి:
మోదీ పంజాబ్ టూర్‌కు నిరసనకారుల బ్రేక్- 20 నిమిషాలు ఫ్లైఓవర్‌పైనే!