గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణం ఈ ఏడాది పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. డిజిటల్ లైబ్రరీలు కూడా పూర్తి చేయాలని నిర్దేశించారు. జియో ట్యాగింగ్ చేసి నిర్మాణాల తీరు సమీక్షించాలన్నారు. గ్రామాల్లో చెత్త తరలింపు కోసం 14వేల ట్రైసైకిళ్లు, పట్టణ ప్రాంతాలకు సమీపంలోని పల్లెల్లో వెయ్యికి పైగా ఆటోల కొనుగోలుకు సీఎం అంగీకారం తెలిపారు.
వైఎస్‌ఆర్ జలకళ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలని.. బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యామ్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం అమలుకు.. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
ఇదీ చదవండి: