జనతా బజార్ల ద్వారా పంట ఉత్పత్తులకు తగినస్థాయిలో మార్కెటింగ్ కల్పించాలని... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జనతా బజార్ల నిర్వహణ, విధివిధానాలపై సమీక్షించిన సీఎం జగన్... అధికారులకు సూచనలు చేశారు. జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులు విక్రయించేలా చూడాలన్న సీఎం జగన్... గ్రేడింగ్, ప్యాకింగ్ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కరోనా వల్ల వికేంద్రీకరించిన రైతుబజార్లను ఇకముందూ కొనసాగించాలని స్పష్టం చేశారు.
రైతుల నుంచి కొన్న ఉత్పత్తులను వికేంద్రీకరించిన రైతుబజార్లలో విక్రయించేలా చూడాలన్న ముఖ్యమంత్రి జగన్... దీనివల్ల మార్కెట్‌లో పోటీపెరిగి రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మార్కెట్‌లో ఉత్పత్తులు నిలవాలంటే గ్రేడింగ్, ప్యాకింగ్ బాగుండాలని చెప్పారు. చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారుచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరింత మేధోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలని సూచించారు.
ఇదీ చదవండీ... టెలీ మెడిసిన్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయండి: సీఎం